Share News

రేపు కుప్పానికి సీఎం సతీమణి

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:40 AM

3 రోజులపాటు భువనేశ్వరి పర్యటన

రేపు కుప్పానికి సీఎం సతీమణి
డీకేపల్లె చెరువులో భువనేశ్వరి జలహారతి ఏర్పాట్లపై సూచనలిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల తదితరులు

కుప్పం, నవంబరు 17 (ఆంరఽధజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈనెల 19, 20, 21 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీడీపీ వర్గాల సమాచారం మేరకు భువనేశ్వరి 19వ తేదీన కుప్పం వస్తారు.కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు. నిండి మొరవ పారడానికి సిద్ధమైన డీకేపల్లె చెరువులో కృష్ణా జలాలకు హారతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో డీకేపల్లె చెరువును సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, కడా రాజకీయ సలహా మండలి సభ్యుడు రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వి.శ్రీనివాసరావు తదితరులు సందర్శించారు. జలహారతికోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్ర శేఖర్‌, అప్పు ముఖేశ్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 12:40 AM