సీఎం టూర్ సక్సెస్
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:13 AM
పథకాలను అమలు చేస్తున్నా, వాటిని జనాల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేయడంలో టీడీపీ శ్రేణులు పూర్తిగా విఫలమవుతున్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పదేపదే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ పథకాల గురించి తమ నాయకులు ఎటూ చెప్పరని, అందుకోసమే తాను వచ్చి చెబుతున్నానని అనడం ఇందుకు ఉదాహరణ. దీనికి తగ్గట్టుగానే బుధవారం రాత్రి తిమ్మరాజుపల్లెలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక పథకం పేరును గత ప్రభుత్వంలో ఉన్నప్పటి పేరుతోనే ఒక కుటుంబ సభ్యురాలు చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక, వెనుదిరిగి వెనుక ఉన్న స్థానిక నాయకులవైపు ఆగ్రహంగా చూడడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. ‘ఏమయ్యా.. ఏం చేస్తున్నారు మీరు?’ అని ప్రశ్నించిన ఆయన, అంతకుమించి మాట్లాడే చోటు కాకపోవడంతో ఊరకుండిపోయారు. చంద్రబాబు స్వగృహం ఉన్న పరిధిలోని 60 మంది ఓటర్లను కుటుంబ సాధికార సమితిగా ఏర్పాటు చేసి, ఆ ఓటర్లనే కలవాలని తొలుత నిర్ణయించారు. అయితే స్థానిక నాయకులు కేఎస్‌ఎస్ పరిధిలోనివి కాకుండా తాము అనుకున్న కుటుంబాలను సందర్శనకు ఎంపిక చేయడాన్ని చంద్రబాబు గుర్తించి నాయకులను మందలించారు.
వైద్యానికి డిజిటల్ హంగులు
టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం ఫ భవిష్యత్తు అభివృద్ధి ఉపదేశం
‘మామిడి రైతులు, పల్ప్ కంపెనీలు సమన్వయంతో కలిసి పని చేయాలి. ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకోవాలి. మామిడి రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.’
మామిడి రైతులకు భరోసా.
‘ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి ఇకనైనా ప్రచారం చేయండి. చేసిన పని చెప్పుకోకపోతే ఎలా? ఇది చివరకు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది.’
టీడీపీ శ్రేణులకు ఉద్బోధ.
‘నేను గత ప్రభుత్వం కంటే అన్ని పథకాల ప్రయోజనాలను రెట్టింపు చేశా. ఉదాహరణకు జగన్ పింఛను వెయ్యి పెంచేందుకు అయిదేళ్లు తీసుకున్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశా.’
లబ్ధిదారులతో సంక్షేమ కార్యక్రమాల ప్రచారం.
కుప్పం,జూలై 3 (ఆంఽధ్రజ్యోతి):
టీడీపీ శ్రేణుల తీరుపై అసంతృప్తి
ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నా, వాటిని జనాల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేయడంలో టీడీపీ శ్రేణులు పూర్తిగా విఫలమవుతున్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పదేపదే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ పథకాల గురించి తమ నాయకులు ఎటూ చెప్పరని, అందుకోసమే తాను వచ్చి చెబుతున్నానని అనడం ఇందుకు ఉదాహరణ. దీనికి తగ్గట్టుగానే బుధవారం రాత్రి తిమ్మరాజుపల్లెలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక పథకం పేరును గత ప్రభుత్వంలో ఉన్నప్పటి పేరుతోనే ఒక కుటుంబ సభ్యురాలు చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక, వెనుదిరిగి వెనుక ఉన్న స్థానిక నాయకులవైపు ఆగ్రహంగా చూడడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. ‘ఏమయ్యా.. ఏం చేస్తున్నారు మీరు?’ అని ప్రశ్నించిన ఆయన, అంతకుమించి మాట్లాడే చోటు కాకపోవడంతో ఊరకుండిపోయారు. చంద్రబాబు స్వగృహం ఉన్న పరిధిలోని 60 మంది ఓటర్లను కుటుంబ సాధికార సమితిగా ఏర్పాటు చేసి, ఆ ఓటర్లనే కలవాలని తొలుత నిర్ణయించారు. అయితే స్థానిక నాయకులు కేఎస్‌ఎస్ పరిధిలోనివి కాకుండా తాము అనుకున్న కుటుంబాలను సందర్శనకు ఎంపిక చేయడాన్ని చంద్రబాబు గుర్తించి నాయకులను మందలించారు.
కుప్పం అభివృద్ధిపైనే కేంద్రీకృతం
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఈసారి కుప్పం అభివృద్ధిపైనే కేంద్రీకృతమైంది. సుమారు 1300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం, ప్రసంగంలో రాష్ట్ర, దేశ రాజకీయాల ప్రస్తావన తగ్గించి, కేవలం కుప్పం అభివృద్ధిని గురించే ప్రసంగించడం వంటివి స్థానిక ప్రజలను ఆనందపరిచాయి. ప్రజా వేదికలో అందుకే ఆయన ప్రసంగానికి పదేపదే చప్పట్లు కురిశాయి.