7న నారావారిపల్లెకు సీఎం
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:55 AM
సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ నెల7న చంద్రగిరి మండలం నారావారిపల్లెకు రానున్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా వస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో బయలుదేరి అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి నారావారిపల్లెకు వెళ్లి రామ్మూర్తి నాయుడి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 11వ నెల విస్తర కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సీఎం తిరుగు ప్రయాణమవుతారు. కాగా, సీఎం సతీమణి భువనేశ్వరి, రామ్మూర్తినాయుడి సతీమణి ఇందిరా 5వ తేది సాయంత్రమే రానున్నారు. ఇక, రంగంపేట హైస్కూల్ సమీపంలో సీఎం పర్యటన కోసం తాత్కాలిక హెలిప్యాడ్ స్థలాన్ని ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఇక, వ్యవసాయ కళాశాలలో రూ.10లక్షలతో శాశ్వత ప్రాతిపదికన హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. ఇకపై సీఎం పర్యటనకు దీనిని వినియోగించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. కాగా, వ్యవసాయ కళాశాల గ్రౌండులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్ద శుక్రవారం పారా మిలటరీ బలగాలు, డాగ్, బాంబు స్క్వాడ్‌లు తనిఖీలు చేశాయి. అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్‌భాషా, రిజర్వు బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
కుటుంబ సమేతంగా రానున్న చంద్రబాబు
చంద్రగిరి/తిరుపతి(కలెక్టరేట్/నేరవిభాగం), అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ నెల7న చంద్రగిరి మండలం నారావారిపల్లెకు రానున్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా వస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో బయలుదేరి అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి నారావారిపల్లెకు వెళ్లి రామ్మూర్తి నాయుడి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 11వ నెల విస్తర కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సీఎం తిరుగు ప్రయాణమవుతారు. కాగా, సీఎం సతీమణి భువనేశ్వరి, రామ్మూర్తినాయుడి సతీమణి ఇందిరా 5వ తేది సాయంత్రమే రానున్నారు. ఇక, రంగంపేట హైస్కూల్ సమీపంలో సీఎం పర్యటన కోసం తాత్కాలిక హెలిప్యాడ్ స్థలాన్ని ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఇక, వ్యవసాయ కళాశాలలో రూ.10లక్షలతో శాశ్వత ప్రాతిపదికన హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు. ఇకపై సీఎం పర్యటనకు దీనిని వినియోగించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. కాగా, వ్యవసాయ కళాశాల గ్రౌండులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్ద శుక్రవారం పారా మిలటరీ బలగాలు, డాగ్, బాంబు స్క్వాడ్‌లు తనిఖీలు చేశాయి. అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్‌భాషా, రిజర్వు బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.