Share News

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:02 AM

నగరి నియోజకవర్గంలోని 160 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద రూ.1,32,34,595 మంజూరయ్యాయి.

నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందుకున్న వారితో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌

నగరి నియోజకవర్గంలోని 160 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద రూ.1,32,34,595 మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఆదివారం నగరిలోని టీడీపీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పంపిణీ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక అర్హులైనవారందరికీ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్య ఖర్చులను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమావేశంలో నగరి నేతలతో పాటు పుత్తూరు మున్సిపల్‌ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, మండల అధ్యక్షుడు అరవ బాలాజి, ధనంజయనాయుడు, రమే్‌షరాజు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు చిట్టి, నగరి పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాలాజి తదితరులు పాల్గొన్నారు.

‘నియోజకవర్గంలోని కొందరు మద్యం దుకాణదారులు, భూదందాలు చేసిన వారు పైరవీల కోసం నావద్దకు వచ్చారు. వారిని నిర్మొహమాటంగా తిరిగి పంపించేశా. ఇలా ఏడాది పాటు నా వద్దకొచ్చిన వ్యవహారాలను తిప్పికొట్టా. ఇలాంటి అంశాల్లో గతంలో రోజా రూ.కోట్లు సంపాదించారు. నేను అవినీతి అక్రమాలకు తావివ్వను. ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించను.

- ఎమ్మెల్యే భానుప్రకాష్‌

- నగరి, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 06 , 2025 | 12:02 AM