శ్రీకాళహస్తి విద్యార్థికి సీఎం ప్రశంస
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:57 AM
శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లికి చెందిన భానుచరణ్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
శ్రీకాళహస్తి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లికి చెందిన భానుచరణ్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇతడికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 51వ ర్యాంకు వచ్చింది. విజయవాడలో శుక్రవారం భానుచరణ్‌ను సీఎం సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ కూడా అతడిని అభినందించారు.