Share News

పలమనేరులో జడ్పీ నిధులపై రగడ

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:43 AM

పలమనేరులో జడ్పీ నిధుల ఖర్చుపై వివాదం నెలకొంది. మండలంలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన వారే కావడంతో మండలంలో అభివృద్ది పనుల కేటాయింపు విషయం అధికారులకు కత్తిమీద సాములా మారింది. మిగిలిన మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ రెండు పార్టీల నేతలు పనుల విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నందున ఈ సమస్య తలెత్తడంలేదు. పలమనేరులో మాత్రం వైసీపీ, టీడీపీ నేతల మధ్య సమన్వయం లేక అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బుధవారం పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ రోజా, జడ్పీటీసీ మల్లిక, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేశారు. మండలంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంపీడీవో సహకరించడం లేదని ఆరోపించారు.అంతకుముందు జరిగిన మండల మీట్‌లో సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ రోజా ప్రకటించారు.

పలమనేరులో జడ్పీ నిధులపై రగడ

-మండల సమావేశం నిరవధిక వాయిదా

- గత సమావేశాలపై విచారణకు డిమాండు

- ఎంపీడీవోను సరెండర్‌ చేయాలని నిర్ణయం

పలమనేరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : పలమనేరులో జడ్పీ నిధుల ఖర్చుపై వివాదం నెలకొంది. మండలంలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన వారే కావడంతో మండలంలో అభివృద్ది పనుల కేటాయింపు విషయం అధికారులకు కత్తిమీద సాములా మారింది. మిగిలిన మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ రెండు పార్టీల నేతలు పనుల విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నందున ఈ సమస్య తలెత్తడంలేదు. పలమనేరులో మాత్రం వైసీపీ, టీడీపీ నేతల మధ్య సమన్వయం లేక అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బుధవారం పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ రోజా, జడ్పీటీసీ మల్లిక, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేశారు. మండలంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంపీడీవో సహకరించడం లేదని ఆరోపించారు.అంతకుముందు జరిగిన మండల మీట్‌లో సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ రోజా ప్రకటించారు.మండల సమావేశాల్లో తీర్మానించిన అంశాల అమలులో నిర్లక్ష్యం వహించడంతో పాటు తాము గత సమావేశాన్ని వాయిదా వేయగా దాన్ని సభ్యులు బహిష్కరించారని జిల్లా అఽధికారులకు నివేదిక పంపిన ఎంపీడీవో ఖాదర్‌బాషాను జడ్పీకి సరెండర్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.గత రెండు సమావేశాలపై జిల్లా అధికారులు విచారణ జరపాలని మినిట్స్‌బుక్‌లో నోట్‌ చేసి సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు.పలమనేరు మండలానికి గతంలో జిల్లా పరిషత్‌ ద్వారా మంజూరైన నిధులతో రాజకీయ విభేదాల కారణంగా పనులు చేపట్టలేదు.ఇటీవల కలెక్టర్‌ జడ్పీ నిధులతో మంజూరు చేసిన పనులను రద్దుచేసి తాగునీటి పనులకే ప్రాధాన్యమివ్వాలని, పనులు శాఖాపరంగా మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. అయితే ఎంపీడీవో అధికార పార్టీ నేతలకు వర్క్‌ ఆర్డరు ఇవ్వడంతో వైసీపీకి చెందిన ఎంపీపీ సహా ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహించారు. నేతల ఆదేశాలమేరకే పనుల నిర్ణయం తీసుకున్నానని ఎంపీడీవో వివరణ ఇచ్చారు.గత సమావేశం వాయిదా వేసినట్టు చెప్పినప్పటికీ మినిట్స్‌ బుక్‌లో ఆమోదించినట్టు ఎలా రాస్తారని ఎంపీడీవోను నిలదీశారు. అయితే ఆ సమావేశానికి తాను హాజరు కాలేదని సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారని ఎంపీడీవో చెప్పినా సభ్యులు పట్టించుకోలేదు.

Updated Date - Apr 10 , 2025 | 02:43 AM