Share News

ఎస్వీసెట్‌లో సినీసందడి

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:34 AM

తల్లీ, కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సినిమా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి అని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ అన్నారు. పూతలపట్టు మండలం ముత్తిరేవుల సమీపాన గల శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎస్వీసెట్‌)లో బుధవారం సాయంత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని విద్యార్థుల కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా అమ్మలకు రుణపడి వుండాలన్నారు. అనంతరం సీనియర్‌ నటి విజయశాంతి మాట్లాడుతూ తన బిడ్డలాంటి కళ్యాణ్‌రామ్‌తో కలసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషదాయకమన్నారు.నటుడు పృథ్వి అలియాస్‌ బబ్లూ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ తల్లికి థ్యాంక్స్‌ చెప్తారన్నారు. అంతకుమునుపు చిత్రంలోని రెండవ పాట ‘ముచ్చటగా బంధాలే’ని విడుదల చేశారు.

ఎస్వీసెట్‌లో సినీసందడి
హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ ప్రసంగం - హీరో కళ్యాణ్‌ రామ్‌ అభివాదం

- వేడుకగా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఆడియో లాంచ్‌

పూతలపట్టు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : తల్లీ, కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే సినిమా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి అని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ అన్నారు. పూతలపట్టు మండలం ముత్తిరేవుల సమీపాన గల శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల (ఎస్వీసెట్‌)లో బుధవారం సాయంత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని విద్యార్థుల కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా అమ్మలకు రుణపడి వుండాలన్నారు. అనంతరం సీనియర్‌ నటి విజయశాంతి మాట్లాడుతూ తన బిడ్డలాంటి కళ్యాణ్‌రామ్‌తో కలసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషదాయకమన్నారు.నటుడు పృథ్వి అలియాస్‌ బబ్లూ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ తల్లికి థ్యాంక్స్‌ చెప్తారన్నారు. అంతకుమునుపు చిత్రంలోని రెండవ పాట ‘ముచ్చటగా బంధాలే’ని విడుదల చేశారు. అనంతరం కళాశాల చైర్మన్‌ రావూరి వెంకటస్వామి,చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్‌ మాట్లాడుతూ అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు.హీరో కళ్యాణ్‌రామ్‌ను, నటి విజయశాంతిని సన్మానించారు.హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌, దర్శకుడు చిలుకూరి ప్రదీప్‌, నిర్మాతలు అశోక్‌వర్దన్‌, సునీల్‌ బాలు, ఎడిటర్‌ తమ్మిరాజు, కెమెరామెన్‌ రామ్‌ప్రసాద్‌, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, కళాశాల వైస్‌ చైర్మన్‌ రావూరి శ్రీనివాస్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌ బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ లోకనాథ రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ ఫంక్షన్‌ చూడ్డానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జనం తరలిరావడంతో కళాశాల ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.పలు సినిమా పాటలకు విద్యార్థులు వేసిన డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి.

Updated Date - Apr 10 , 2025 | 02:34 AM