వేడుకగా చొక్కాణి ఉత్సవం
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:27 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద బుధవారం రాత్రి చొక్కాని ఉత్సవం వైభవంగా సాగింది. తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చుక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవానికి ఒకరోజు ముందు అంటే మంగళవారం రాత్రి ఆలయంలో వేదపండితులు కలశస్థాపనతో కృతవును శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అమ్మవారి సన్నిధి వద్ద బాలదీపాలను వెలిగించి స్వామివారి సన్నిధి వద్ద భద్రపరిచారు. బుధవారం రాత్రి వరకు దీపాలు నిరంతరాయం వెలిగేలా ఏర్పాటు చేశారు. ఉదయం మహానంది వద్ద వేదపండితులు కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిచెట్టుకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. తాటిచెట్టును మహానంది వెనుకవైపున నిలబెట్టారు. చుట్టూ మట్టలను కప్పారు. రాత్రి ఆలయం నుంచి బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా తాటిచెట్టు వరకు తీసుకువచ్చి ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చొక్కాణిని వెలిగించారు. చొక్కాణి జ్యోతి అఖండ ప్రజ్వలనతో ప్రకాశించింది. ఈ ఘట్టాన్ని తిలికించేందుకు సాయంత్రం నుంచే భక్తులు వర్షంలో తడుస్తూనే నిరీక్షించారు. చొక్కాణి పూర్తయిన తర్వాత అందులోని భస్మాన్ని ఈశ్వరప్రసాదంగా భావించి భక్తులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద బుధవారం రాత్రి చొక్కాని ఉత్సవం వైభవంగా సాగింది. తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చుక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవానికి ఒకరోజు ముందు అంటే మంగళవారం రాత్రి ఆలయంలో వేదపండితులు కలశస్థాపనతో కృతవును శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అమ్మవారి సన్నిధి వద్ద బాలదీపాలను వెలిగించి స్వామివారి సన్నిధి వద్ద భద్రపరిచారు. బుధవారం రాత్రి వరకు దీపాలు నిరంతరాయం వెలిగేలా ఏర్పాటు చేశారు. ఉదయం మహానంది వద్ద వేదపండితులు కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిచెట్టుకు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. తాటిచెట్టును మహానంది వెనుకవైపున నిలబెట్టారు. చుట్టూ మట్టలను కప్పారు. రాత్రి ఆలయం నుంచి బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా తాటిచెట్టు వరకు తీసుకువచ్చి ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చొక్కాణిని వెలిగించారు. చొక్కాణి జ్యోతి అఖండ ప్రజ్వలనతో ప్రకాశించింది. ఈ ఘట్టాన్ని తిలికించేందుకు సాయంత్రం నుంచే భక్తులు వర్షంలో తడుస్తూనే నిరీక్షించారు. చొక్కాణి పూర్తయిన తర్వాత అందులోని భస్మాన్ని ఈశ్వరప్రసాదంగా భావించి భక్తులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.