Share News

చిత్తూరు మండీలకు పోటెత్తిన కాయలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:45 AM

చిత్తూరు మండీలకు మంగళవారం మామిడి కాయలు పోటెత్తాయి. గత వారం మొదట్లో రోజుకు కేవలం 4-10 టన్నుల మధ్య కాయలు వచ్చాయి. సోమవారం 200 టన్నులు రాగా, మంగళవారం 275టన్నుల దాకా వచ్చాయి.కాయలు నాణ్యంగా ఉండడంతో మంగళవారం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేశారు.మార్కెటింగ్‌ ఏడీ పరమేశ్వరన్‌ మండీకి వచ్చిన మామిడి రకాలను,నాణ్యతను పరిశీలించారు. మండీల యజమానులు, ఎగుమతిదారులతో ధరలపై చర్చించారు. రైతులకు లాభసాటి ధరలు వచ్చేలా చర్యలు చేపట్టారు. వర్షాలు ఆలస్యం కావడం మామిడి రైతులకు అనుకూలంగా మారింది. ఈదురుగాలులతో రాలిన కాయలతో నష్టం వాటిల్లినా, కూలీల సాయంతో కోసిన మామిడికి ధర బాగానే పలికింది. బంగారుపాళ్యం మండీలకు మంగళవారం 50 టన్నుల వరకు మామిడి రాగా, వచ్చే వారంలో అధికంగా వస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

చిత్తూరు మండీలకు పోటెత్తిన కాయలు
గుజరాత్‌ ఎగుమతిదారులతో ధరలపై మాట్లాడుతున్న ఏడీ పరమేశ్వరన్‌

ఫ ఎగుమతులతో లాభసాటి ధరలు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మండీలకు మంగళవారం మామిడి కాయలు పోటెత్తాయి. గత వారం మొదట్లో రోజుకు కేవలం 4-10 టన్నుల మధ్య కాయలు వచ్చాయి. సోమవారం 200 టన్నులు రాగా, మంగళవారం 275టన్నుల దాకా వచ్చాయి.కాయలు నాణ్యంగా ఉండడంతో మంగళవారం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేశారు.మార్కెటింగ్‌ ఏడీ పరమేశ్వరన్‌ మండీకి వచ్చిన మామిడి రకాలను,నాణ్యతను పరిశీలించారు. మండీల యజమానులు, ఎగుమతిదారులతో ధరలపై చర్చించారు. రైతులకు లాభసాటి ధరలు వచ్చేలా చర్యలు చేపట్టారు. వర్షాలు ఆలస్యం కావడం మామిడి రైతులకు అనుకూలంగా మారింది. ఈదురుగాలులతో రాలిన కాయలతో నష్టం వాటిల్లినా, కూలీల సాయంతో కోసిన మామిడికి ధర బాగానే పలికింది. బంగారుపాళ్యం మండీలకు మంగళవారం 50 టన్నుల వరకు మామిడి రాగా, వచ్చే వారంలో అధికంగా వస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫ చిత్తూరు మండీలో మామిడి ధరలు

--------------------------------------------------------------

రకం టన్ను ధర (రూ.వేలల్లో)

బేనీషా 18-25

తోతాపురి 8(పచ్చి కాయలు)-13(దోర కాయలు)

పుల్లూర 8-10

మల్లిక 30-40

ఇమాంపసంద్‌ 60-75

కాలేపాడ్‌ 30-40

--------------------------------------------------------------

కోతల మామిడికి ధర బాగుంది

కూలీల సాయంతో చెట్ల నుంచి కోసిన కాయలకు ధర అధికంగా పలికింది. కాయలు బరువుగా, నాణ్యంగా వుండడంతో ధర వచ్చింది. రాలిన కాయలు, దోటితో కోసిన కాయలు దెబ్బతిని, పురుగుపట్టడంతో ధర పలకడం లేదు. కోతల్లో జాగ్రత్తలు పాటించి మండీలకు తెస్తే గిరాకి బాగుంది.

- కృష్ణమూర్తి నాయుడు, మండీ యజమాని

Updated Date - Jun 04 , 2025 | 01:45 AM