Share News

ప్లాస్టిక్‌రహిత జిల్లాగా చిత్తూరు

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:14 AM

చిత్తూరును ప్లాస్టిక్‌ రహితజిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా ‘స్వచ్ఛత - ప్లాస్టిక్‌ నిర్మూలన’ కార్యక్రమం జిల్లా అంతటా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని చెత్తాచెదారాలను వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సెక్షన్లు ఆఫీసర్లు, సిబ్బంది, డీఆర్వో మోహన్‌కుమార్‌తో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కలెక్టర్‌ చేయించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం నిలిపి. జూట్‌ బ్యాగులను వినియోగిస్తూ కలెక్టరేట్‌ సిబ్బంది అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలన - జ్యూట్‌ బ్యాగులు, స్టీల్‌ వాటర్‌ బాటిళ్ల వినియోగంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్లాస్టిక్‌రహిత జిల్లాగా చిత్తూరు
కలెక్టరేట్‌లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

  • కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూరును ప్లాస్టిక్‌ రహితజిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా ‘స్వచ్ఛత - ప్లాస్టిక్‌ నిర్మూలన’ కార్యక్రమం జిల్లా అంతటా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని చెత్తాచెదారాలను వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సెక్షన్లు ఆఫీసర్లు, సిబ్బంది, డీఆర్వో మోహన్‌కుమార్‌తో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కలెక్టర్‌ చేయించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం నిలిపి. జూట్‌ బ్యాగులను వినియోగిస్తూ కలెక్టరేట్‌ సిబ్బంది అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలన - జ్యూట్‌ బ్యాగులు, స్టీల్‌ వాటర్‌ బాటిళ్ల వినియోగంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.

Updated Date - Jul 20 , 2025 | 01:14 AM