Share News

చిత్తూరు ఏడీఏ సావిత్రికి జరిమానా

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:16 AM

చిత్తూరు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న సావిత్రికి జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో పనిచేసిన కాలంలో ఆమె కింది ఉద్యోగుల నుంచి లంచాల కోసం పీడించినట్లు ఆరోపణలొచ్చాయి.

చిత్తూరు ఏడీఏ సావిత్రికి జరిమానా

రాయచోటిలో పనిచేసినప్పుడు పరాకాష్టకు చేరిన అవినీతి ఫలితం

సాటి ఉద్యోగుల నుంచే లంచాలు వసూలు చేయడంపై నాలుగేళ్ల విచారణ

కలికిరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న సావిత్రికి జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో పనిచేసిన కాలంలో ఆమె కింది ఉద్యోగుల నుంచి లంచాల కోసం పీడించినట్లు ఆరోపణలొచ్చాయి. నాలుగేళ్లుగా దీనిపై కొనసాగిన విచారణ అనంతరం సావిత్రి వైపు నుంచి సంజాయిషీలు, వివరణలు తీసుకున్న తరువాత తాజాగా ఆమెకు రెండు ఇంక్రిమెంట్లు పూర్తి సర్వీసు కాలంలో (క్యుమ్యులేటివ్‌ ఎఫెక్ట్‌తో) కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఏడీఏ సావిత్రి వేధింపులు భరించలేక రాయచోటి డివిజన్‌లోని సచివాలయ వ్యవసాయ, పశుసంవర్థక సహాయకులు, వీఎ్‌సఏలు, ఎంపీఈవోలు జిల్లా అఽధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి కడప జాయింట్‌ కలెక్టర్‌ విచారణ నిర్వహించి సావిత్రి నిర్వాకాలపై 2021 మే 15 ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కమిషనరును ప్రభుత్వం ఆదేశించింది. సావిత్రి నుంచి వివరణలు తీసుకున్న అనంతరం గుంటూరు జేడీఏ వి.డి.కె.కృపాదా్‌సను, డీడీఏ ఎన్‌సీహెచ్‌ బాలూనాయక్‌లను విచారణాధికారులుగా నియమించారు. ఆ తరువాత గుంటూరు అదనపు డైరెక్టర్‌ బి.ప్రసాద్‌ చేత కూడా విచారణ జరిపించారు. మొత్తం మీద అన్ని విచారణల్లోనూ సావిత్రి అవినీతికి పాల్పడ్డట్లు పూర్తి ఆధారాలున్నట్లు నివేదికలు ప్రభుత్వానికి అందాయి. చివరిసారిగా సావిత్రి వైపు నుంచి వివరణలు తీసుకున్న అనంతరం ఆమె పూర్తి సర్వీసు కాలంలో రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Nov 12 , 2025 | 01:16 AM