Share News

చిన్నగొట్టిగల్లు ‘విండో’లో ఉద్యోగి చేతివాటం

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:59 AM

చిన్నగొట్టిగల్లు సింగిల్‌విండోలో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి అక్కడి ఉద్యోగే రూ.72 లక్షలు స్వాహా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సమగ్ర విచారణకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) సీఈవో శంకర్‌బాబు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు విండోలో కొన్నేళ్లుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా జగదీశ్‌ పనిచేస్తున్నారు. కె.రెడ్డెమ్మ, సి.రుతున్‌ పేర్లతో ఈ ఏడాది జనవరి 18, 21, ఫిబ్రవరి 11 తేదీల్లో 1,235 గ్రాముల నకిలీ బంగారం (వన్‌గ్రామ్‌ గోల్డ్‌)ను 29 సంచుల్లో కుదువపెట్టి రూ.72 లక్షలు స్వాహా చేశాడు. ఈనెల 4వ తేదీన బంగారం నగల కుదువ తనిఖీల్లో బ్రాంచి మేనేజర్‌ లక్ష్మీపస్రాద్‌ ఈ వ్యవహారాన్ని గుర్తించారు. దీనిపై ప్రాథమిక నివేదికను డీసీసీబీ ఉన్నతాధికారులకు ఆయన పంపారు. పరిశీలించిన అధికారులు సమగ్ర విచారణకోసం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఏజీఎం సురే్‌షబాబును విచారణాధికారిగా నియమించారు. సోమవారం నుంచి విండోలో సమగ్ర విచారణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా సీఈవో జగదీశ్‌ పనితీరుపై ఆరేళ్ల కాలానికి(2019-25) విచారణ జరపాలని విండో చైర్మన్‌ ముత్తా ప్రభాకర్‌ బ్యాంకు అధికారులను కోరారు. నకిలీ బంగారం కుదువ వ్యవహారంలో అప్రైజర్‌ తీరుపైనా విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యాక దీనివెనుక ఇంకెందరున్నారన్నది బయటపడనుంది.

చిన్నగొట్టిగల్లు ‘విండో’లో   ఉద్యోగి చేతివాటం

  • నకిలీ బంగారం కుదువపెట్టి

రూ.72 లక్షల స్వాహా చేసినట్లు వెలుగులోకి

  • విచారణకు ఆదే శించిన డీసీసీబీ సీఈవో

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): చిన్నగొట్టిగల్లు సింగిల్‌విండోలో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి అక్కడి ఉద్యోగే రూ.72 లక్షలు స్వాహా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సమగ్ర విచారణకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) సీఈవో శంకర్‌బాబు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు విండోలో కొన్నేళ్లుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా జగదీశ్‌ పనిచేస్తున్నారు. కె.రెడ్డెమ్మ, సి.రుతున్‌ పేర్లతో ఈ ఏడాది జనవరి 18, 21, ఫిబ్రవరి 11 తేదీల్లో 1,235 గ్రాముల నకిలీ బంగారం (వన్‌గ్రామ్‌ గోల్డ్‌)ను 29 సంచుల్లో కుదువపెట్టి రూ.72 లక్షలు స్వాహా చేశాడు. ఈనెల 4వ తేదీన బంగారం నగల కుదువ తనిఖీల్లో బ్రాంచి మేనేజర్‌ లక్ష్మీపస్రాద్‌ ఈ వ్యవహారాన్ని గుర్తించారు. దీనిపై ప్రాథమిక నివేదికను డీసీసీబీ ఉన్నతాధికారులకు ఆయన పంపారు. పరిశీలించిన అధికారులు సమగ్ర విచారణకోసం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఏజీఎం సురే్‌షబాబును విచారణాధికారిగా నియమించారు. సోమవారం నుంచి విండోలో సమగ్ర విచారణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా సీఈవో జగదీశ్‌ పనితీరుపై ఆరేళ్ల కాలానికి(2019-25) విచారణ జరపాలని విండో చైర్మన్‌ ముత్తా ప్రభాకర్‌ బ్యాంకు అధికారులను కోరారు. నకిలీ బంగారం కుదువ వ్యవహారంలో అప్రైజర్‌ తీరుపైనా విచారణ జరగనుంది. విచారణ పూర్తయ్యాక దీనివెనుక ఇంకెందరున్నారన్నది బయటపడనుంది.

తనిఖీ చేయలేదా?

ప్రతి మూడు నెలలకు ఒకసారి విండోల్లో, బ్యాంకు బ్రాంచీల్లో తనిఖీలు జరుగుతాయి. మరి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ నకిలీ బంగారం కుదువ వ్యవహారంపై ఏప్రిల్‌, ఆగస్టు నెలల్లో అధికారులు ఎందుకు తనిఖీ చేయలేదు.. లేదా తనిఖీ చేసిన అధికారులు ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా? అన్న కోణంపైనా ఉన్నతాధికారులు దృష్టిపెడుతున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 01:59 AM