Share News

ధ్వజారోహణానికి చెల్లూరు దర్భ

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:02 AM

ధ్వజారోహణానికి వినియోగించే దర్భ చాప, తాడు ఊరేగింపుగా సోమవారం తిరుమల ఆలయానికి చేరాయి. టీటీడీ అటవీ విభాగం దర్భను సేకరించింది. టీటీడీ ఫారెస్ట్‌ డిపోలో అంతకుముందు వీటికి నిర్వహించిన పూజలో డీఎ్‌ఫవో ఫణికుమార్‌ నాయుడు, ఎఫ్‌ఆర్వోలు పాల్గొన్నారు.

ధ్వజారోహణానికి చెల్లూరు దర్భ

దీనితో 22 అడుగుల చాప, 225 మీటర్ల తాడు

తిరుమల, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): ధ్వజారోహణానికి వినియోగించే దర్భ చాప, తాడు ఊరేగింపుగా సోమవారం తిరుమల ఆలయానికి చేరాయి. టీటీడీ అటవీ విభాగం దర్భను సేకరించింది. టీటీడీ ఫారెస్ట్‌ డిపోలో అంతకుముందు వీటికి నిర్వహించిన పూజలో డీఎ్‌ఫవో ఫణికుమార్‌ నాయుడు, ఎఫ్‌ఆర్వోలు పాల్గొన్నారు. రంగనాయక మండపంలో శేషవాహనంపై వీటిని ఉంచారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.

తిరుమలలో వాడేది విష్ణుదర్భ

దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపైవరకు చుడతారు. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అని రెండు రకాలుంటాయి. తిరుమలలో విష్ణు దర్భనే వినియోగిస్తారు. ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీశాఖ సేకరిస్తుంది. వారం రోజుల పాటు ఎండబెట్టి శుభ్రపరుస్తారు. 22 అడుగు పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భ చాపను అల్లుతారు. 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడును పేనుతారు.

Updated Date - Sep 23 , 2025 | 01:02 AM