నేటి నుంచి ‘వీఐపీ బ్రేక్’ వేళల మార్పు
ABN , Publish Date - May 01 , 2025 | 01:50 AM
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళల మార్పు గురువారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చింది.
తిరుమల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళల మార్పు గురువారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చింది. అయినప్పటికీ జనరల్ బ్రేక్ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 నుంచి 10 గంటల్లోపు.. ఆ తర్వాత ప్రొటోకాల్, రెఫరల్, శ్రీవాణి, ఉద్యోగులకు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్ దర్శనాల్లో మే ఒకటి నుంచి పూర్వపు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను 7.30లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇక సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలనూ మే1 నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.
ఉదయం 5.45: ప్రొటోకాల్ దర్శనం
6.30: రిఫరెల్ ప్రొటోకాల్
6.45: జనరల్ బ్రేక్
10.15: శ్రీవాణి(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్)
10.30: దాతలు
11.00: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు
ఫ గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభం.