Share News

కఠారి కుటుంబానికి అండగా చంద్రబాబు

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:55 AM

హత్యకు గురైన కఠారి కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారు.టీడీపీలో, ప్రభుత్వంలో వారి కుటుంబీలకులకు పెద్ద పీట వేశారు. హత్య జరిగిన సమయంలో సీఎంగా ఉన్న ఆయన కేసు పటిష్టంగా ఉండేలా చూసుకున్నారు.

కఠారి కుటుంబానికి అండగా చంద్రబాబు

పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం

చిత్తూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): హత్యకు గురైన కఠారి కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారు.టీడీపీలో, ప్రభుత్వంలో వారి కుటుంబీలకులకు పెద్ద పీట వేశారు. హత్య జరిగిన సమయంలో సీఎంగా ఉన్న ఆయన కేసు పటిష్టంగా ఉండేలా చూసుకున్నారు.టీడీపీలో పనిచేస్తున్న కఠారి మోహన్‌కు అప్పటి ఎమ్మెల్యే సీకే బాబుతో వైరం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడేవాడు. రెండుసార్లు సీకే బాబు మీద జరిగిన హత్యాయత్నంలో మోహన్‌ పేరు వినిపించింది. 2014లో సాధారణ ఎన్నికల కంటే ముందు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చిత్తూరు మేయర్‌ పోస్టు మహిళకు రిజర్వు అయింది. దీంతో మోహన్‌ తన భార్య అనురాఽధను గెలిపించుకున్నారు.

ఘటనా స్థలానికి సీఎం

2015 నవంబరులో హత్య జరిగిన తర్వాత అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నేరుగా హత్య జరిగిన చిత్తూరు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. ప్రధాన ప్రత్యక్ష సాక్షి సతీష్‌ సహా మరికొందరు సాక్షులతో, కుటుంబీకులతో హత్య జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. హంతకుల్ని ఉద్దేశించి సమాజంలో అలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేస్తానని హామీ ఇచ్చారు. కేసు విచారణ సవ్యంగా జరిగేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఫ హేమలతకు మేయర్‌ పదవి

అనురాధ తర్వాత కొన్నాళ్ల పాటు డిప్యూటీ మేయర్‌ సుబ్రి ఇన్‌చార్జి మేయర్‌గా వ్యవహరించారు. గంగనపల్లె డివిజన్‌లో జరిగిన ఉప ఎన్నికలో అనురాధ కోడలు హేమలత కార్పొరేటర్‌గా గెలిచి, మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ ఉన్నంతవరకు హేమలత, అప్పటి ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నగరాభివృద్ధికి కృషి చేశారు. కఠారి మోహన్‌ కుమారుడు ప్రవీణ్‌ టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఫ రెండుసార్లు ఇంటికి వెళ్లి పరామర్శ

కరోనా సమయంలో హేమలత భర్త ప్రవీణ్‌ మరణించగా, కొన్నాళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిత్తూరులో చురుగ్గా ఉన్న హేమలత అంటే రుచించక వైసీపీ అక్రమ కేసులతో వేధించింది. అందులో భాగంగా ఓ పోలీసు జీపును ఆమె కాళ్లపై ఎక్కించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సుమారు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఇంటికి డిశ్చార్జి అయి వెళ్లిన ఆమెను మరోసారి చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఫ అంతటా ఏకగ్రీవమైనా హేమలత విజయం

వైసీపీ హయాంలో 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమ ఏకగ్రీవాలు, బెదిరింపులు చేసినా.. గంగనపల్లె డివిజన్లో మాత్రం హేమలత గెలిచారు. 50 డివిజన్లలో మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలవగా, వారిలో హేమలత ఉన్నారు.

ఫ చుడా ఛైర్‌పర్సన్‌గా హేమలత

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును ఆశించిన హేమలతకు పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి స్థానం దక్కింది. తొలుత పర్యాటక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చినా, ఆ తర్వాత ఆమె సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు చుడా ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చి సముచిత స్థానాన్ని కల్పించారు.

Updated Date - Nov 01 , 2025 | 01:55 AM