Share News

రేపు కుప్పానికి చంద్రబాబు

ABN , Publish Date - May 20 , 2025 | 02:28 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. కుప్పంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించనున్న విశ్వరూప దర్శనానికి సీఎం హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని.. పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలకమండలి సభ్యుడు వైద్యం శాంతారాం, ఏఎస్పీ నందకిషోర్‌, డీఎస్పీ పార్థసారథి, పీఆర్‌ఎ్‌సఈ చంద్రశేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజు, ఏఆర్‌ డీఎస్పీ పి.మహబూబ్‌బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు కుప్పానికి చంద్రబాబు
గంగమాంబ ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

  • గంగమాంబను దర్శించుకోనున్న సీఎం

  • ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీ

కుప్పం, మే 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. కుప్పంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించనున్న విశ్వరూప దర్శనానికి సీఎం హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని.. పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలకమండలి సభ్యుడు వైద్యం శాంతారాం, ఏఎస్పీ నందకిషోర్‌, డీఎస్పీ పార్థసారథి, పీఆర్‌ఎ్‌సఈ చంద్రశేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజు, ఏఆర్‌ డీఎస్పీ పి.మహబూబ్‌బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పర్యటన వివరాలిలా..

సీఎం బుధవారం ఉదయం 10.50 గంటలకు విజయవాడనుంచి విమానంలో బయల్దేరి 11.50కి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో దిగుతారు. తర్వాత రోడ్డు మార్గాన 12.50 గంటలకు గంగమాంబ ఆలయం చేరుకుని అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, సారె సమర్పిస్తారు. ఆలయంనుంచి 1.30 గంటలకు బయల్దేరి హెలిప్యాడ్‌కు వెళ్తారు. ఇక్కడ కొద్దిసేపు గడుపుతారు. 2.30 గంటలకు బయల్దేరి మూడు గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి సాయంత్రం 4గంటలకు బయల్దేరి 5.05 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

Updated Date - May 20 , 2025 | 02:28 AM