పథకాల పర్యవేక్షణకు ఎస్వోగా చక్రధర బాబు
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:29 AM
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును జిల్లాలో పర్యవేక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోనల్ స్థాయుల్లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జి అధికారులుగా నియమించింది.అందులో భాగంగా జిల్లా ఇంఛార్జి అధికారిగా కేవీఎన్ చక్రధర బాబు నియమితులు కాగా చిత్తూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు,తిరుపతి , అన్నమయ్య తదితర ఐదు జిల్లాలతో కూడిన జోన్‌కు ఇంఛార్జి అధికారిగా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు నియమితులయ్యారు. ఈ ఇద్దరు అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

- జోనల్ ఇన్‌చార్జిగా కృష్ణబాబు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును జిల్లాలో పర్యవేక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోనల్ స్థాయుల్లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జి అధికారులుగా నియమించింది.అందులో భాగంగా జిల్లా ఇంఛార్జి అధికారిగా కేవీఎన్ చక్రధర బాబు నియమితులు కాగా చిత్తూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు,తిరుపతి , అన్నమయ్య తదితర ఐదు జిల్లాలతో కూడిన జోన్‌కు ఇంఛార్జి అధికారిగా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు నియమితులయ్యారు. ఈ ఇద్దరు అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
జిల్లా ఇంఛార్జి అధికారికి కీలక బాధ్యతలు
జిల్లా ఇంఛార్జి అధికారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో తరచూ పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలి. ఆ దిశగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులకు సహకరించాలి. ప్రతి పదిహేను రోజులకోసారి జిల్లా అధికారులతో సమావేశమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలి. గ్రామాల్లో పర్యటించడంతో పాటు నెలకు కనీసం రెండు సార్లు గ్రామాల్లో రాత్రిళ్ళు బస చేయాలి. ప్రజల నుంచీ వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమవుతున్నదీ లేనిదీ సమీక్షించాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి. నెలవారీ పురోగతికి సంబంధించిన నివేదికలను జోనల్ ఇంఛార్జికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలి.
జోనల్ ఇంఛార్జికి మార్గదర్శక బాధ్యతలు
ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమాలు, పథకాలు అమలు విజయవంతం కావడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించాలి. జిల్లాస్థాయిలో నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించాలి.ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల్లో పా ల్గొనాలి.నెలకోసారి గ్రామాలను సందర్శించి రాత్రి బస చే యాలి. పారిశ్రామికవేత్తలు, రైతులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు,పన్ను చెల్లింపుదారులతో సమావేశమై చర్చించాలి. కలెక్టర్ సహా జిల్లా అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిని సమీక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అవాంతరాలను గుర్తించి, వాటికి కారణాలేమిటన్నది విశ్లేషించాలి.ముఖ్యమైన ప్రాజెక్టులకు ని ధుల కేటాయింపు,నిధుల వ్యయం వంటి అంశాలను సమీక్షిం చాలి.జిల్లా పురోగతితో పాటు సమస్యలు,సిఫారసులతో కూడి న నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలి.