Share News

బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:13 AM

జిల్లాలోని అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు, అలారాలు ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకుల వద్దనున్న సీసీ కెమెరాలను పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయాలి. దీనివల్ల రాత్రి సమయాల్లో స్టేషన్ల నుంచి ప్రత్యేక నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది’ అని ఎస్పీ హర్షవర్ధనరాజు పేర్కొన్నారు.

బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు
బ్యాంకర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న ఎస్పీ

పోలీసు స్టేషన్లకు అనుసంధానం

వీడియో కాన్ఫరెన్సులో బ్యాంకర్లకు ఎస్పీ సూచన

తిరుపతి(నేరవిభాగం), జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలోని అన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు, అలారాలు ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకుల వద్దనున్న సీసీ కెమెరాలను పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయాలి. దీనివల్ల రాత్రి సమయాల్లో స్టేషన్ల నుంచి ప్రత్యేక నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది’ అని ఎస్పీ హర్షవర్ధనరాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని బ్యాంకర్లు, డీఎస్పీలు, సీఐలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హిందూపురంలో బ్యాంకు దోపిడీ జరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యలపై బ్యాంకర్లు, పోలీసు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. బ్యాంకుల్లోని సీసీ కెమెరాల పనితీరు, రికార్డు అవుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో ఎన్ని నెలల పాటు బ్యాకప్‌ వుంటుందని అడిగారు. క్వాలిటీ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు? వారి విధులేంటనే వివరాలు తమకు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని ఏటీఎంల వద్దనున్న సాంకేతిక సమస్యలను పరిశీలించి పునరుద్ధరించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం బ్యాంకు డ్యూటికి వచ్చినప్పుడు చెక్‌ లిస్టు ఏర్పాటు చేసుకోవాలని.. క్లోజ్‌ చేసి వెళ్లేముందు అన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు.

Updated Date - Aug 01 , 2025 | 02:13 AM