మరో 20 ఏళ్లు సీబీఎన్నే సీఎం
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:35 AM
సీఎంగా చంద్రబాబు నాయుడి ప్రస్థానం 30 ఏళ్లు పూర్తయింది. మరో 20 ఏళ్లూ ఆయనే సీఎంగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ అన్నారు.
సీఎంగా చంద్రబాబు నాయుడి ప్రస్థానం 30 ఏళ్లు పూర్తయింది. మరో 20 ఏళ్లూ ఆయనే సీఎంగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ అన్నారు. సీబీఎన్ సీఎంగా 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేయి కళ్ల దుత్తలతో సోమవారం తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మకు టీడీపీ నేతలు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నేతలు బ్యాంకు శాంతమ్మ, అనిత, హేమ, రేవతి, యశోద తదితరులు పాల్గొన్నారు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి