దొంగలు దొరకలేదని కేసులు క్లోజ్..!
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:37 AM
తిరుపతి నగరం లక్ష్మీపురానికి చెందిన జి.శశివదన కుటుంబంతో కలసి 2022 సెప్టెంబరు 22న స్వగ్రామంలో శుభ కార్యానికి బయలుదేరారు. ఇంట్లోని దాదాపు 500 గ్రాముల బంగారు నగలు, మరో 120 గ్రాముల వెండి వస్తువులు, దాదాపు రూ.2.40 లక్షల నగదు సూట్ కేసులో ఉంచుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. ద్విచక్ర వాహవాన్ని పార్కింగ్ చేస్తున్న సమయంలో దొంగ ఏమార్చి.. సూట్‌కేసును అపహరించుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో (421-2022) కేసు నమోదైంది.
వైసీపీ హయాంలో 50కిపైగా మూసేసిన వైనం
స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఇప్పుడు మేమేం చేసేదంటున్న పోలీసులు
తిరుపతి నగరం లక్ష్మీపురానికి చెందిన జి.శశివదన కుటుంబంతో కలసి 2022 సెప్టెంబరు 22న స్వగ్రామంలో శుభ కార్యానికి బయలుదేరారు. ఇంట్లోని దాదాపు 500 గ్రాముల బంగారు నగలు, మరో 120 గ్రాముల వెండి వస్తువులు, దాదాపు రూ.2.40 లక్షల నగదు సూట్ కేసులో ఉంచుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. ద్విచక్ర వాహవాన్ని పార్కింగ్ చేస్తున్న సమయంలో దొంగ ఏమార్చి.. సూట్‌కేసును అపహరించుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో (421-2022) కేసు నమోదైంది.
ఫ తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్వీపీ కాలనీలో కాపురమున్న ఎస్వీబీసీలో జూనియర్ అసిస్టెంట్ ఎస్.విమల 2019 ఫిబ్రవరి 26న ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లారు. అక్కడ్నుంచి తన కుమారుడు చదువుతున్న విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లారు. ఇంటికి వేసిన తాళాన్ని దుండగులు పగులగొట్టి దాదాపు రూ.2.80 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ (89-2019) కేసు నమోదు చేశారు.
- ఈ రెండు దొంగతనాల కేసుల్లో దొంగలు దొరకలేదంటూ గతేడాది ఎన్నికల ముందే కేసు మూసేశారు. ఇలా జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మూసేసిన కేసులు వైసీపీ ప్రభుత్వ హయాంలో (అన్ డిటెక్టివ్) 50కి పైగా ఉన్నట్లు సమాచారం. తమకు న్యాయం జరక్క బాధితులు లబోదిబోమంటున్నారు.
ఎంతో కష్టపడి.. పైసా పైసా కూడబెట్టుకున్న సొత్తు దొంగల పరమైతే ఆ బాధితుల వేదన ఎంతో? ఎప్పటికైనా పోలీసులు రికవరీ చేసిస్తారన్న ఆశతో ఏళ్ల తరబడి చూసిన వారికి.. తమ కేసులు మూసేశారని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దొంగతనం, దోపిడీ, బ్యాగులు ఎత్తుకెళ్లడం వంటి కేసుల్లో రికవరీపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. దొంగలు దొరికినప్పుడు చూద్దాం.. అనుకుంటూ ఉదాసీనంగా ఉండిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరకు.. ప్రతి నెలా జరిగే ఎస్పీ నేర సమీక్షా సమావేశంలో సమాధానం ఎందుకు చెప్పుకోవాలని భావించారు. చివరకు దొంగలు దొరకలేదంటూ కేసులు మూసేశారు. ఇలా 2019 నుంచి 2024 వరకు.. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మూసేసిన కేసులు ఉండటం గమనార్హం. అప్పట్లో పోలీసు బాస్‌లు కేసులు కూడా రికవరీపై దృష్టి సారించకపోవడంతో కిందస్థాయిలోనూ అదే నిర్లక్ష్యంతో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. తమ కేసులు మూసేసినా.. పలువురు బాధితులు ఇప్పటికీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అప్పట్లో దొంగతనం జరిగి.. కేసులూ మూసేస్తే ఇప్పుడు మేము ఏం చేయాలంటూ కొందరు పోలీసులు బాధితులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం మీరేం చేస్తున్నారు. ఇప్పుడు మా వద్దకొచ్చి మొత్తుకుంటే ఎలాగంటున్నారు. దీనిపై గత సోమవారం జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో ఓ బాధితురాలు ఎస్పీ హర్షవర్ధనరాజును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి