హిడెన్ కెమెరా పెట్టిన ఇంజనీరుపై కేసు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:37 AM
చిత్తూరు సమీపంలోని ఓ యూనివర్సిటీలో ఇటీవల గర్ల్ప్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ తుషార్ డూడి స్పందించారు. పోలీసులను గురువారం యూనివర్సిటీకి పంపారు. జరిగిన ఘటనపై విద్యార్థులను, అధ్యాపకులను వారు విచారించారు. కెమెరా అమర్చిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం టాయిలెట్‌లో ఉంచి వీడియో చిత్రికరణకు ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులోని వీడియోలు, డేటాను అప్పటికే డిలీట్ చేసి వుండడంతో రికవరీకి పంపించినట్లు పోలీసులు వివరించారు. టాయిలెట్‌లో హిడెన్ కెమెరా పెట్టిన కందరూబెన్(27)పై చిత్తూరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులకు సైట్ ఇంజనీరుగా ఇతడు పనిచేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం రాజపాళయం తాలుకా, తంగలింగాపురం గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
చిత్తూరు రూరల్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు సమీపంలోని ఓ యూనివర్సిటీలో ఇటీవల గర్ల్ప్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ తుషార్ డూడి స్పందించారు. పోలీసులను గురువారం యూనివర్సిటీకి పంపారు. జరిగిన ఘటనపై విద్యార్థులను, అధ్యాపకులను వారు విచారించారు. కెమెరా అమర్చిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం టాయిలెట్‌లో ఉంచి వీడియో చిత్రికరణకు ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులోని వీడియోలు, డేటాను అప్పటికే డిలీట్ చేసి వుండడంతో రికవరీకి పంపించినట్లు పోలీసులు వివరించారు. టాయిలెట్‌లో హిడెన్ కెమెరా పెట్టిన కందరూబెన్(27)పై చిత్తూరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులకు సైట్ ఇంజనీరుగా ఇతడు పనిచేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం రాజపాళయం తాలుకా, తంగలింగాపురం గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.