Share News

మైనారిటీ నేతను అక్కున చేర్చుకుని..

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:12 AM

గత వైసీపీ ప్రభుత్వంలో బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలక బెదరక.. ఎదురొడ్డి నిలబడిన మైనారిటీ నేత అల్లాబక్షు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ హామీ హామీ ఇచ్చారు.

మైనారిటీ నేతను అక్కున చేర్చుకుని..
అల్లాబక్షు కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేశ్‌

కుటుంబానికి అండగా ఉంటామంటూ మంత్రి లోకేశ్‌ హామీ

తడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలక బెదరక.. ఎదురొడ్డి నిలబడిన మైనారిటీ నేత అల్లాబక్షు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ హామీ హామీ ఇచ్చారు. ఓజిలి మండలం ఆరిమేనిపాడుకు చెందిన టీడీపీ మైనార్టీసెల్‌ నాయకుడు అల్లాబక్షు.. 2021లో టీడీపీ నుంచి సర్పంచ్‌, ఎంపీటీసీకు పలువురిని బరిలో ఉంచారు. దీనిని సహించలేని వైసీపీ నాయకులు బెదిరించారు. అయినా, బెదరక పోటీలో నిలవడంతో ఆయన 3.50 ఎకరాల్లోని జామాయిల్‌ తోటలను నరికేశారు. ఆ భూములను నిషేధిత జాబితా 22ఏలో చేర్చారు. అల్లాబక్షు కొత్తగా కట్టుకున్న ఇంటి గోడను కూలగోట్టారు. అయినా అల్లాబక్షు లొంగక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి మరింతగా టీడీపీ కోసం కష్టపడి పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్‌.. కుటుంబం సహా తనను కలవాలని కబురు పంపారు. ఆప్రరకారం మంగళవారం ఉండవల్లిలోని లోకేశ్‌ ఇంటికి అల్లాబక్షు దంపతులు, పిల్లలు వెళ్లారు. వీరి కుటుంబ వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న లోకేశ్‌.. పార్టీకి అండగా నిలిచి పోరాడిన అల్లాబక్షును అభినందించారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరడంతో పరిశీలిస్తామని హామీఇచ్చారు. కుటుంబానికి అండగా ఉండటంతో పాటు పిల్లల చదువుకు తాను అండగా నిలుస్తానని లోకేష్‌ భరోసానిచ్చారు.

Updated Date - Jul 02 , 2025 | 02:12 AM