వరసిద్ధుడి పాలాభిషేకానికి విరిగిన పాలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 02:07 AM
కాణిపాక వరసిద్ధుడికి నిర్వహించే పాలాభిషేకానికి బుధవారం సాయంత్రం విరిగిపోయిన పాలు అందాయి. రోజూ ఆలయంలో నిర్వహించే పాలాభిషేకంలో భక్తులు పాల్గొంటారు. బుధవారం సాయంత్రం ఒక భక్తురాలు 10 లీటర్ల పాలు స్వామికి అందిస్తామని ఆలయానికి విచ్చేశారు. పాలాభిషేకం నిర్వహించడానికి క్యూలైన్‌లో నిలబడి టికెట్టు కొనుగోలు చేసి ఆలయం వద్దకు విచ్చేశారు. 10 లీటర్ల పాలు కొనుగోలు చేసిన భక్తురాలు ఆలయంలోకి వెళ్లాక ఆ పాలు విరిగిపోయిన సంగతిని గుర్తించిన అర్చకులు ఈవో పెంచలకిషోర్‌కు తెలియజేశారు. ఆయన విరిగిపోయిన ఆ పాలను బయట పోయించారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నుంచి ఆలయం వద్ద పాలాభిషేకానికి పాలు విక్రయించరాదంటూ అతడి కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలు సరఫరా చేసే హక్కును ఎవరు కైవసం చేసుకున్నా స్వామికి స్వచ్ఛమైన పాలను అందించాలన్నారు. ఇకపై ఆలయం వద్ద ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
పక్కన పెట్టిన ఆలయ అధికారులు
కాంట్రాక్టును రద్దు చేసిన ఈవో
ఐరాల(కాణిపాకం), జూలై 9(ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడికి నిర్వహించే పాలాభిషేకానికి బుధవారం సాయంత్రం విరిగిపోయిన పాలు అందాయి. రోజూ ఆలయంలో నిర్వహించే పాలాభిషేకంలో భక్తులు పాల్గొంటారు. బుధవారం సాయంత్రం ఒక భక్తురాలు 10 లీటర్ల పాలు స్వామికి అందిస్తామని ఆలయానికి విచ్చేశారు. పాలాభిషేకం నిర్వహించడానికి క్యూలైన్‌లో నిలబడి టికెట్టు కొనుగోలు చేసి ఆలయం వద్దకు విచ్చేశారు. 10 లీటర్ల పాలు కొనుగోలు చేసిన భక్తురాలు ఆలయంలోకి వెళ్లాక ఆ పాలు విరిగిపోయిన సంగతిని గుర్తించిన అర్చకులు ఈవో పెంచలకిషోర్‌కు తెలియజేశారు. ఆయన విరిగిపోయిన ఆ పాలను బయట పోయించారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం నుంచి ఆలయం వద్ద పాలాభిషేకానికి పాలు విక్రయించరాదంటూ అతడి కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలు సరఫరా చేసే హక్కును ఎవరు కైవసం చేసుకున్నా స్వామికి స్వచ్ఛమైన పాలను అందించాలన్నారు. ఇకపై ఆలయం వద్ద ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
మామిడి రైతుల సబ్సిడీకి రూ.260 కోట్లు మంజూరు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
చిత్తూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజనులో ఉమ్మడి చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులు ధరల పతనంలో నష్టపోకుండా ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.260 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో 76,700 మంది రైతులు 80 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి సాగు చేస్తున్నారు. ఈ సీజనులో 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చింది. ఈ మొత్తం సేకరించేందుకు గానూ కిలోకు రూ. 4 వంతున సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం దానికోసం రూ. 260 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి జిల్లా వరకూ చూస్తే 14,582 హెక్టార్లలో తోతాపురి సాగవుతోంది. ఆ మేరకు 1.45 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈనెల 5వ తేదీ నాటికి జిల్లాలో 10,046 మంది రైతులకు చెందిన 67,988.68 టన్నుల తోతాపురి సేకరించడం జరిగింది. దానికి గానూ రైతులకు సబ్సిడీ కింద రూ. 27.18 కోట్లు చెల్లించాల్సి వుంది. మొత్తం తోతాపురి మామిడి సేకరణ పూర్తయితే సబ్సిడీ కింద రూ. 58 కోట్లు ప్రభుత్వం నుంచీ రైతులకు అందుతుంది.