పార్వతీదేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:51 AM
: దసరా మహోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ పార్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి రెండు చేతుల్లో కమలాలు, ఇంకో చేతిలో శివలింగం, మరో చేయి అభయ హస్తంగా స్వర్ణాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి, ధూపదీప నైవేద్యం సమర్పించారు. డార్మిటరి హాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి, కళశ స్థాపన చేశారు.
====================================================================
చౌడేపల్లె,సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : దసరా మహోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ పార్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి రెండు చేతుల్లో కమలాలు, ఇంకో చేతిలో శివలింగం, మరో చేయి అభయ హస్తంగా స్వర్ణాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి, ధూపదీప నైవేద్యం సమర్పించారు. డార్మిటరి హాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి, కళశ స్థాపన చేశారు.