Share News

ధనలక్ష్మీదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:48 AM

దసరా ఉత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ శుక్రవారం ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చేతుల్లో కనకధార అక్షయపాత్ర.. అందులో రూ.10, 20, 50, 100 నోట్లు.. మరో రెండు చేతుల్లో కమలాలు, మెడలో బంగారు, ఐదు రూపాయల కాయిన్లు, నెమలి పింఛాల హారాలతో గంగమ్మను అలంకరించారు.

ధనలక్ష్మీదేవిగా బోయకొండ గంగమ్మ
ధనలక్ష్మీదేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ

చౌడేపల్లె, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ శుక్రవారం ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చేతుల్లో కనకధార అక్షయపాత్ర.. అందులో రూ.10, 20, 50, 100 నోట్లు.. మరో రెండు చేతుల్లో కమలాలు, మెడలో బంగారు, ఐదు రూపాయల కాయిన్లు, నెమలి పింఛాల హారాలతో గంగమ్మను అలంకరించారు. డార్మిటరీ హాల్లో కలశ స్థాపన చేసి ఉత్సవమూర్తిని ఆశీనులను చేశారు. గణపతి, నవగ్రహ, దుర్గ, చండీ, మృత్యుంజయేశ్వర, ధనలక్ష్మీదేవి హోమాలు నిర్వహించారు. ఉభయదారులకు అమ్మవారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను ఆలయ ఈవో ఏకాంబరం అందజేశారు.

======================

Updated Date - Sep 27 , 2025 | 01:48 AM