భక్తులతో కిక్కిరిసిన ‘బోయకొండ’
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:27 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాభిషేకాలు చేశారు. అమ్మవారికి కృష్ణగిరికి చెందిన భక్తుడు అరుణ్‌కుమార్ దంపతులు నెమలి పింఛాలు, రూ.5 కాయిన్లతో పూలహారాన్ని బహూకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు.
చౌడేపల్లె, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాభిషేకాలు చేశారు. అమ్మవారికి కృష్ణగిరికి చెందిన భక్తుడు అరుణ్‌కుమార్ దంపతులు నెమలి పింఛాలు, రూ.5 కాయిన్లతో పూలహారాన్ని బహూకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు.