Share News

ఎముకలు దొరికాయి

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:28 AM

నగరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన గుణశీలన్‌(65) శరీర అవశేషాలను పోలీసులు బుధవారం వెలికి తీశారు. బీమా సొమ్ము కోసం గంగాధరం, అయ్యప్పన్‌ జూన్‌4వ తేదీన గుణశీలన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.

ఎముకలు దొరికాయి
గుణశీలన్‌ శవం కోసం చెరువులో గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

బయటపడిన గుణశీలన్‌ శరీర బాగాలు

నిందితుల అరెస్ట్‌

నగరి, అక్టోబర్‌15 (ఆంధ్రజ్యోతి):నగరి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన గుణశీలన్‌(65) శరీర అవశేషాలను పోలీసులు బుధవారం వెలికి తీశారు. బీమా సొమ్ము కోసం గంగాధరం, అయ్యప్పన్‌ జూన్‌4వ తేదీన గుణశీలన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. తిరుత్తణి పోలీసులు బుధవారం ఉదయం నగరి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో సుమారు10 గంటలు వెతికారు. కొన్ని శరీర భాగాలను గుర్తించగలిగారు. గుణశీలన్‌ను హత్య చేశాక విడివిడిగా శరీరభాగాలను నరికి గోనెసంచిలో కట్టి చెరువులో పడేయడంతో ఎముకలు మాత్రం లభ్యమయ్యాయి. మొండెం కనిపించినా తల కనిపించలేదు. దొరికిన శరీర అవశేషాలను తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. హైకోర్టుకు వెళ్లడంతో కేసు ఛేదించారని, ఎముకలు మాత్రమే కనిపించాయని మృతుడి కుమార్తె సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.తిరువళ్లూరు డీఎస్పీ కందన్‌ నగరి ఏరియా వైద్యశాల వద్ద పోస్టుమార్టం చేయించారు.నిందితులను తమిళ పోలీసులు తిరుత్తణికి తీసుకెళ్లారు.

Updated Date - Oct 16 , 2025 | 02:28 AM