చల్లకాలువలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:53 AM
కోట మండలం కర్లపూడి సమీపంలోని చల్లకాలువ నదిలో శుక్రవారం గల్లంతైన మాణికల పోలయ్య(68) మృతదేహం లభ్యమైంది. కర్లపూడిలోని మేకలతోక గిరిజనకాలనీకి చెందిన పోలయ్య, స్నేహితుడితో కలిసి రెండు రోజుల క్రితం చేపలు పట్టేందుకు సమీపంలోని చల్లకాలువ నదిలోకి వెళ్లారు. పోలయ్య చేపలు పట్టేందుకు వల విసురుతూ ప్రమాదవశాత్తు నదిలో పడి వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న తహసీల్దారు జయజయరావు, ఎంపీడీవో దిలీ్‌పకుమార్ నాయక్, ఎస్‌ఐ పవన్‌కుమార్, అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలయ్య కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం గోవిందపల్లిపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారులైన గజ ఈతగాళ్లను పిలిపించి పొద్దుపోయే వరకు చల్లకాలువలో గాలించినప్పటికీ పోలయ్య జాడ తెలియలేదు.
కోట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కోట మండలం కర్లపూడి సమీపంలోని చల్లకాలువ నదిలో శుక్రవారం గల్లంతైన మాణికల పోలయ్య(68) మృతదేహం లభ్యమైంది. కర్లపూడిలోని మేకలతోక గిరిజనకాలనీకి చెందిన పోలయ్య, స్నేహితుడితో కలిసి రెండు రోజుల క్రితం చేపలు పట్టేందుకు సమీపంలోని చల్లకాలువ నదిలోకి వెళ్లారు. పోలయ్య చేపలు పట్టేందుకు వల విసురుతూ ప్రమాదవశాత్తు నదిలో పడి వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న తహసీల్దారు జయజయరావు, ఎంపీడీవో దిలీ్‌పకుమార్ నాయక్, ఎస్‌ఐ పవన్‌కుమార్, అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలయ్య కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం గోవిందపల్లిపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారులైన గజ ఈతగాళ్లను పిలిపించి పొద్దుపోయే వరకు చల్లకాలువలో గాలించినప్పటికీ పోలయ్య జాడ తెలియలేదు. శుక్రవారం ఉదయం చల్లకాలువ నదిలోని కర్రతుమ్మ చెట్ల మధ్య గల్లంతైన పోలయ్య మృతదేహం తేలియాడుతుండటాన్ని గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.