బీజేపీ సంబరాలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:57 AM
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో చిత్తూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
చిత్తూరు సెంట్రల్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో చిత్తూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ సర్కిల్‌లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.బిహార్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ మరోసారి విజయకేతనం ఎగురవేయడంతో మోదీపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు.బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు చంద్రమోహన్, రవికుమార్, నాయకులు సత్యభామ, దామోదర్, బాబు, షణ్ముగం, రాజేంద్రన్, భానుప్రకాష్, మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.