Share News

‘ఉపాఽధి’ శ్రామికులపై తేనెటీగల దాడి

ABN , Publish Date - May 06 , 2025 | 01:14 AM

ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో 19 మంది అస్వస్థతకు గురయ్యారు.

‘ఉపాఽధి’ శ్రామికులపై తేనెటీగల దాడి
అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

- 19 మందికి అస్వస్థత

శ్రీరంగరాజపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌ఆర్‌పురం మండలం అంబరమహారాజపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లె సమీపంలో సోమవారం ఉదయం కొండ కాలువ పనులు అదే గ్రామానికి చెందిన 25మంది ఉపాధి శ్రామికులు చేస్తున్నారు. ఉన్నట్టుండి వారిపై పెద్ద తేనెటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు. తేనెటీగలు కుట్టడంతో బాలకృష్ణయ్య(55), మహేంద్రన్‌ (38), శ్రీదేవి(40), మోహనమ్మ(45), కె.శ్రీదేవి (42), నాగరాజు(50), అమరామ్మ(53), ఎల్లమ్మ(38), జయంద్రన్‌ (54), నాగరాజమ్మ(45), అన్నదమ్ములు.. ఆంజనేయులు(46), జరాచంద్రుడు(48)లతోపాటు మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. 12 మందిని ఎస్‌ఆర్‌పురం పీహెచ్‌సీకి తరలించారు. ఏడుగురిని 108లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఆంజనేయులు, జరాచంద్రుడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏపీడీ మల్లికార్జున, ఎంపీడీవో మోహన మురళి, ఏపీవో లలితలు ఆస్పత్రికెళ్లి బాధితులను పరామర్శించారు.

Updated Date - May 06 , 2025 | 01:14 AM