Share News

నిషేధిత జాబితా నుంచి ఆటోనగర్‌ స్థలాలకు విముక్తి

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:21 AM

తిరుపతి ఆటోనగర్‌ స్థలాల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధాన్ని ఎత్తివేశారు. సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

నిషేధిత జాబితా నుంచి ఆటోనగర్‌ స్థలాలకు విముక్తి

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఆటోనగర్‌ స్థలాల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధాన్ని ఎత్తివేశారు. సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆటోనగర్‌ యజమానులు ఊరట చెందారు. చాన్నాళ్లుగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. రెవెన్యూ సదస్సులో అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధంగా యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 337 ఆటోమొబైల్‌ యూనిట్లకు ప్రయోజనం చేకూరింది.

Updated Date - Sep 30 , 2025 | 01:21 AM