Share News

బంగారు కుటుంబానికి ఆటో

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:23 AM

పీ4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్న కుటుంబానికి ‘రాస్‌’ ఆటోను అందించింది. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చైతన్యపురానికి చెందిన సతీష్‌ ఆటో డ్రైవర్‌. అనారోగ్య సమస్యలతో సుమారు రూ.20లక్షల వరకు ఖర్చు చేశారు.

బంగారు కుటుంబానికి ఆటో

పీ4 కార్యక్రమంలో ‘మార్గదర్శి’గా అందించిన రాస్‌

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పీ4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్న కుటుంబానికి ‘రాస్‌’ ఆటోను అందించింది. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చైతన్యపురానికి చెందిన సతీష్‌ ఆటో డ్రైవర్‌. అనారోగ్య సమస్యలతో సుమారు రూ.20లక్షల వరకు ఖర్చు చేశారు. దీంతో జీవన పరిస్థితి దుర్భరంగా మారింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు ద్వారా రాస్‌ సంస్థను కలెక్టర్‌ సంప్రందించారు. బంగారు కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా రాస్‌ సంస్థ ముందుకువచ్చింది. సంస్థ అందించిన ఆటోను బాధిత కుటుంబానికి సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అందజేశారు. రాస్‌ ప్రధాన కార్యదర్శి వెంటకరత్నం, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 01:23 AM