తుడా ప్లాట్ల వేలం ప్రారంభం
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:43 AM
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) సుమారు 145 ఎకరాల్లో సూరప్పకశం వద్ద వేసిన పద్మావతి నగర్‌లోని 277 ప్లాట్లు ఈ-వేలం ద్వారా అన్ లైన్ పద్ధతిలో గురువారం నుంచి 13వ విడత వేలం ప్రారంభమైంది. తుడా వారి కనీస ధర చదరపు గజం రూ.14వేలుగా నిర్ణయించారు.
తిరుపతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) సుమారు 145 ఎకరాల్లో సూరప్పకశం వద్ద వేసిన పద్మావతి నగర్‌లోని 277 ప్లాట్లు ఈ-వేలం ద్వారా అన్ లైన్ పద్ధతిలో గురువారం నుంచి 13వ విడత వేలం ప్రారంభమైంది. తుడా వారి కనీస ధర చదరపు గజం రూ.14వేలుగా నిర్ణయించారు. తొలిరోజు అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు ఎల్‌ఐజీ 9 ప్లాట్లు, హెచ్‌ఐజీ 3 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ-వేలం ప్రక్రియను ఈనెల 17వతేదీ వరకు నిర్వహిస్తామని తుడా కార్యదర్శి డాక్టర్ ఎన్వీ శ్రీకాంత్ బాబు తెలిపారు. భూసేకరణ అధికారి ఎస్.సుజన, ఐసీసీఐ బ్యాంకు ప్రతినిధి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేలం ప్రక్రియను కార్యదర్శి పర్యవేక్షించారు. ఈ-వేలంలో పాల్గొనదలచిన వారు వెయ్యి రూపాయలు కట్టి ఆన్లైన్‌లో ఈనెల 16వ తేదీ లోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు.