Share News

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:36 AM

నాలుగేళ్ళ చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన గంగాధరనెల్లూరు మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసంతి కథనం మేరకు.... వేపంజేరి పంచాయతీ పరిధిలోని ఓ ఆదిఆంధ్రవాడలో మేకలు మేపడానికి వెళుతున్న తల్లితో కలసి నాలుగేళ్ల చిన్నారి చెరకుతోట వద్దకు వెళ్లింది.

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

గంగాధరనెల్లూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ళ చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన గంగాధరనెల్లూరు మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసంతి కథనం మేరకు.... వేపంజేరి పంచాయతీ పరిధిలోని ఓ ఆదిఆంధ్రవాడలో మేకలు మేపడానికి వెళుతున్న తల్లితో కలసి నాలుగేళ్ల చిన్నారి చెరకుతోట వద్దకు వెళ్లింది. కొంతదూరం వెళ్ళి ఆటలాడుకుంటుండగా వాసయ్య (62) అనే వృద్ధుడు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా తల్లి గమనించి కేకలు వేసింది.దీంతో ఆ చిన్నారిని వదిలేసి వాసయ్య పారిపోయాడు.చిన్నారి తల్లి సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.చిత్తూరు డీఎస్పీ సాయినాధ్‌, జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ పీడీ వెంకటేశ్వరి బాధిత చిన్నారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 02:36 AM