వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు జోరుగా ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:10 AM
కాణిపాక వరసిద్ధుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 16వ తేదీవరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈవో పెంచలకిషోర్ ఆధ్వర్యంలో ఈఈ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు స్వామి దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్నదాన కేంద్రం వద్ద నుంచి ఆలయం వరకు ప్రత్యేక క్యూలైన్లు నిర్మించారు. ఆర్చిల ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణ పనులు పూర్తికావస్తున్నాయి.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 16వ తేదీవరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈవో పెంచలకిషోర్ ఆధ్వర్యంలో ఈఈ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు స్వామి దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్నదాన కేంద్రం వద్ద నుంచి ఆలయం వరకు ప్రత్యేక క్యూలైన్లు నిర్మించారు. ఆర్చిల ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణ పనులు పూర్తికావస్తున్నాయి.