అరణియార్ గేట్లు ఎత్తివేత
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:55 PM
పిచ్చాటూరులోని అరణియార్ పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు. మంగళవారం సాయంత్రానికి 30.3 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా సాయంత్రం 6 గంటలకు ఒక గేటు పైకి ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ కోరారు.
పిచ్చాటూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పిచ్చాటూరులోని అరణియార్ పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు. మంగళవారం సాయంత్రానికి 30.3 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా సాయంత్రం 6 గంటలకు ఒక గేటు పైకి ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ కోరారు.
వరదయ్యపాళెంలో 114.4 మి.మీ. వర్షం
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షం పడిది. మంగళవారం ఉదయం 8.30గంటలకు నమోదైన వర్షపాతం వివరాలిలా.. వరదయ్యపాళెంలో 114.4మి.మీ, తడలో 107.2, సత్యవేడు 94.2, పిచ్చాటూరు 92.2, కేవీబీపురం 89.6, నారాయణవనం 76.4, వడమాలపేట 56.4, పుత్తూరు 50.8, బీఎన్‌కండ్రిగ 45.0, నాగలాపురం 35.4, సూళ్లూరుపేట, డీవీ సత్రం 32.8, తొట్టంబేడు 24.6మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 33.5మి.మీగా నమోదైంది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రంలో అలల ఉధ్రుతి పెరిగింది. నాలుగురోజులుగా చేపలవేట ఆగిపోయింది.