Share News

డిప్లొమాలో లేటరల్‌ ఎంట్రీకి రేపటిలోగా దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:55 AM

బ్రిడ్జికోర్సు పూర్తిచేసిన ఐటీఐ విద్యార్థులు నేరుగా డిప్లొమా ఇంజినీరింగ్‌లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకోసం ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ వై.ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు.

డిప్లొమాలో లేటరల్‌ ఎంట్రీకి రేపటిలోగా దరఖాస్తు చేసుకోండి

19న ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్‌

తిరుపతి(విద్య), జూలై 15(ఆంధ్రజ్యోతి): బ్రిడ్జికోర్సు పూర్తిచేసిన ఐటీఐ విద్యార్థులు నేరుగా డిప్లొమా ఇంజినీరింగ్‌లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకోసం ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ వై.ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఏ కళాశాలలో సీటు కావాలనుకుంటారో ఆ కళాశాలలోనే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆయా కళాశాలల్లో దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులు 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, సీటు పొందినవారు అప్పటికప్పుడే రుసుముకింద సుమారు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.

Updated Date - Jul 16 , 2025 | 01:55 AM