టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:02 AM
ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తులు అందించాలని డీఈవో కేవీఎన్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపధ్యాయులు, ఉపాధ్యాయులు, వారి సంబంధిత మేనేజ్‌మెంట్లకు స్పౌస్, పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తిరుపతి(విద్య), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తులు అందించాలని డీఈవో కేవీఎన్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపధ్యాయులు, ఉపాధ్యాయులు, వారి సంబంధిత మేనేజ్‌మెంట్లకు స్పౌస్, పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బదిలీలు ఆశిస్తున్న వారు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 21 నుంచి 24వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో లీప్ యాప్ ద్వారా దరఖాస్తు సమర్పించి, ఆ ప్రింటవుట్‌ను సంబంధిత ఎంఈవోలకు సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంఈవోలు 25వ తేదీలోపు పరిశీలించి తదుపరి జాబితాను పరిశీలనార్థం డీఈవోకు పంపాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని 26వ తేదీలోపు డీఈవో పరిశీలించి 27వ తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సమర్పించనున్నారని పేర్కొన్నారు. బదిలీల ప్రతిపాదనలను రాష్ట్రస్థాయిలో పరిశీలించి 30వ తేదీన ఫైనల్ జాబితాను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వెల్లడించారు.