లాటరీ నిర్వహించని దుకాణాల దరఖాస్తు రుసుం వాపస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:49 AM
ఎక్కడైనా ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకుంటే వాటికి లాటరీ నిర్వహించేది లేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి బార్లకు సంబంధించి దరఖాస్తు రుసుంను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు.
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకుంటే వాటికి లాటరీ నిర్వహించేది లేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి బార్లకు సంబంధించి దరఖాస్తు రుసుంను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-28 సంవత్సరాలకు సంబంధించి కొత్త బార్ పాలసీ ప్రకటించిన తరుణంలో జిల్లా వ్యాప్తంగా 29 బార్లు, గీతకులాల కోసం ప్రత్యేకంగా మరో మూడు బార్లు కేటాయిస్తున్నారన్నారు. ప్రతి దరఖాస్తుకు రూ 5 లక్షలు దరఖాస్తు రుసుం, ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ 10,000 సమర్పించాలన్నారు. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు అందితేనే లాటరీ తీస్తామన్నారు.