Share News

ఎల్‌ఏ అథారిటీ ప్రిసైడింగ్‌ అధికారిగా అన్వర్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:54 AM

ల్యాండ్‌ అక్విజేషన్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ తిరుపతి ప్రాంతీయ అథారిటీకి ప్రిసైడింగ్‌ అధికారిగా జి.అన్వర్‌ బాషా నియమితులయ్యారు.

ఎల్‌ఏ అథారిటీ ప్రిసైడింగ్‌ అధికారిగా అన్వర్‌

తిరుపతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ అక్విజేషన్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ తిరుపతి ప్రాంతీయ అథారిటీకి ప్రిసైడింగ్‌ అధికారిగా జి.అన్వర్‌ బాషా నియమితులయ్యారు. ప్రజాహిత కార్యక్రమాలకు ప్రభుత్వం భూములు సేకరించే క్రమంలో రైతులు, యజమానులకు న్యాయమైన పరిహారం అందించడానికి, పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలకు కేంద్రంగా తిరుపతిలో ప్రాంతీయ అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ అథారిటీకి తొలి ప్రిసైడింగ్‌ అధికారిగా నియమితులైన రిటైర్డు జిల్లా జడ్జి వెంగయ్య వయో పరిమితి దాటిన కారణంగా 2023 ఆగస్టులో ఈ పోస్టు నుంచి వైదొలిగారు. ఆ స్థానంలో యు.సత్యారావు ఎఫ్‌ఏసీగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రిటైర్డు జిల్లా జడ్జి జి.అన్వర్‌ బాషాను నియమించింది.

Updated Date - Jun 07 , 2025 | 01:54 AM