Share News

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ లబ్ధిదారుల గుర్తింపు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:40 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాన సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకాలకు అర్హులైన రైతులను గుర్తించినట్లు జిల్లా వ్యవసాయధికారి ప్రసాద్‌రావు తెలిపారు.

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ లబ్ధిదారుల గుర్తింపు

తిరుపతి(ఎంఆర్‌పల్లె), జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాన సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకాలకు అర్హులైన రైతులను గుర్తించినట్లు జిల్లా వ్యవసాయధికారి ప్రసాద్‌రావు తెలిపారు. 1,45,360 మంది రైతులను గుర్తించినట్లు వెల్లడించారు. జాబితాను ఆయా రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని, అక్కడి సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈనెల 20వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే 3,180మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. అర్హులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.20వేలు ఆర్ధిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 01:41 AM