చిట్టేడు పొలిమేరల్లో పురాతన చారిత్రక ఆనవాళ్లు
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:32 AM
కోట మండలం చిట్టేడు గ్రామ పొలిమేరల్లో రెండవసారి మంగళవారం కొన్ని పురాతన చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. గూడూరులోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ గోవిందు సురేంద్ర ఆధ్వర్యంలో ఒక బృందం ఈ చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. గత రెండు రోజులుగా చిట్టేడు గ్రామదేవత చిట్టేటమ్మ దేవాలయ సమీపంలోని పొలాల్లో రైతులు వరి ఎల్ధి దుక్కిలు దున్నుతుండగా 15వ శతాబ్దంలోని చిట్టేడు గ్రామపాలేదారులకు సంబంధించిన అనేక ఆధారాలు బయటపడ్డాయి. అప్పట్లో ఈ ప్రాంత ప్రజలు వాడిన మట్టిపాత్రలు, రాతి పనిముట్లు, రుబ్బురోలు, మట్టికుండల పెంకులు బయటపడినట్లు గోవిందు సురేష్ తెలిపారు. అలాగే అనాటి పాలేగార్ల ఆరాధ్యదైవం పురాతన వినాయకుడి రాతి విగ్రహం కూడా బయటపడింది. మత సంబంధమైన ఆచారాలను తెలిపే కొన్ని వస్తువులు కూడా బయటపడినట్లు గోవిందు సురేష్ తెలిపారు. రెండవసారి అధ్యయనంలో మరిన్ని వివరాలు, ఆనవాళ్లు దొరికితే పురావస్తుశాస్త్ర శాఖకు అప్పగిస్తామన్నారు.
కోట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కోట మండలం చిట్టేడు గ్రామ పొలిమేరల్లో రెండవసారి మంగళవారం కొన్ని పురాతన చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. గూడూరులోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ గోవిందు సురేంద్ర ఆధ్వర్యంలో ఒక బృందం ఈ చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. గత రెండు రోజులుగా చిట్టేడు గ్రామదేవత చిట్టేటమ్మ దేవాలయ సమీపంలోని పొలాల్లో రైతులు వరి ఎల్ధి దుక్కిలు దున్నుతుండగా 15వ శతాబ్దంలోని చిట్టేడు గ్రామపాలేదారులకు సంబంధించిన అనేక ఆధారాలు బయటపడ్డాయి. అప్పట్లో ఈ ప్రాంత ప్రజలు వాడిన మట్టిపాత్రలు, రాతి పనిముట్లు, రుబ్బురోలు, మట్టికుండల పెంకులు బయటపడినట్లు గోవిందు సురేష్ తెలిపారు. అలాగే అనాటి పాలేగార్ల ఆరాధ్యదైవం పురాతన వినాయకుడి రాతి విగ్రహం కూడా బయటపడింది. మత సంబంధమైన ఆచారాలను తెలిపే కొన్ని వస్తువులు కూడా బయటపడినట్లు గోవిందు సురేష్ తెలిపారు. రెండవసారి అధ్యయనంలో మరిన్ని వివరాలు, ఆనవాళ్లు దొరికితే పురావస్తుశాస్త్ర శాఖకు అప్పగిస్తామన్నారు.