Share News

నేటి నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌ పోటీలు

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:51 AM

అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే పోటీల ఏర్పాట్లను శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు పర్యవేక్షిస్తున్నారు.

నేటి నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌ పోటీలు

మైదానాల్లో విస్తృత ఏర్పాట్లు

తిరుపతి(క్రీడలు), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే పోటీల ఏర్పాట్లను శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్వీయూ మైదానంలో అథ్లెటిక్స్‌, ఖోఖో, ఎస్వీయూ క్యాంప్‌సలో బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ క్యాంప్‌సస్కూల్‌ వద్ద వాలీబాల్‌, ఆర్చరీ, శ్రీనివాస క్రీడా సముదాయంలో కబడ్డీ, బ్యాడ్మింటన్‌, ఎస్వీఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో హాకీ పోటీలు జరుగుతాయి. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, అధికారులు మొత్తం 1,700మంది ఆదివారం ఉదయానికి చేరుకుంటారు. ఎస్వీయూ, మహిళా వర్శిటీలలో వసతులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్వీయూ మైదానంలో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రవాణా, క్రీడల శాఖామంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ హాజరుకానున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:51 AM