రెండు హోం స్టేల లైసెన్సుల రద్దుకు అనుమతి ఇవ్వండి
ABN , Publish Date - May 28 , 2025 | 02:21 AM
తిరుపతిలో వ్యభిచార గృహాలుగా వాడుతున్న రెండు హోం స్టేల లైసెన్సులు రద్దు చేసి, సీజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్డీవోకు అలిపిరి సీఐ రాంకిషోర్ లేఖ రాశారు.
వ్యభిచారం నిర్వహిస్తుండటంతో చర్యలకు పోలీసుల ప్రతిపాదనలు
తిరుపతి (నేరవిభాగం), మే 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వ్యభిచార గృహాలుగా వాడుతున్న రెండు హోం స్టేల లైసెన్సులు రద్దు చేసి, సీజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్డీవోకు అలిపిరి సీఐ రాంకిషోర్ లేఖ రాశారు. ఇందులో దుర్గా హోం స్టేలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడు వెంకటే్‌షతో పాటు రమణయ్యను మంగళవారం కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయమూర్తి రిమాండ్‌కు విధించారు. అలాగే గతేడాది నవంబరులో ఇదే తరహాలో సెవెన్ హిల్ హోం స్టేలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. దీనిపై నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ రెండు హోం స్టేల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు శాశ్వతంగా సీజ్ చేయడానికి ఆర్డీవో రామ్మోహన్‌రావుకు ప్రతిపాదనలు పంపారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రాం కిషోర్ విజ్ఞప్తి చేశారు.