ఇలా గురి పెట్టాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:05 AM
ఇదిగో, ఈ గన్‌ను ఇలా తీసుకుని గురిపెట్టాలి.. అంటూ విద్యార్థులకు ఎస్పీ సుబ్బరాయుడు అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని పరేడ్ మైదానంలో పోలీసుల ఆయుధాలను ప్రదర్శించారు.
ఇదిగో, ఈ గన్‌ను ఇలా తీసుకుని గురిపెట్టాలి.. అంటూ విద్యార్థులకు ఎస్పీ సుబ్బరాయుడు అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని పరేడ్ మైదానంలో పోలీసుల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫోరెన్సిక్ సామగ్రి తదితరాలు ఎలా పనిచేస్తాయి? ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తామనేది విద్యార్థులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. తద్వారా వారిలో పోలీసు వ్యవస్థపై అవగాహన, విశ్వాసం పెంచడమే లక్ష్యమన్నారు. ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాన్, 9 ఎంఎం పిస్టల్ వంటి ఆయుధాలు, డ్రోన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నిపర్ డాగ్ యూనిట్లను ప్రదర్శించారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవిమనోహరాచ్చారి, శ్రీనివాసరావు, డీఎస్పీలు వెంకటనారాయణ, భక్తవత్సలం, చంద్రశేకర్, ఆర్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి