Share News

మళ్లీ ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్‌’

ABN , Publish Date - May 20 , 2025 | 01:57 AM

ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కిట్టును రూ.1410 వ్యయంతో ఇవ్వనుంది. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించగా, 2019లో వైసీపీ వచ్చాక ఆపేశారు. తాజాగా మళ్లీ ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు లబ్ధి చేకూరుస్తారు. ఈ కిట్‌లో 11 రకాల సామగ్రి ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన తల్లులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో అందజేస్తారు. ఈ పథకం పునరుద్ధరించడంపై ఇది మంచి ప్రభుత్వం అంటూ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్‌’
మళ్లీ ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్‌’

- పథకం పునరుద్ధరణకు ప్రభుత్వ ఆదేశాలు

వెదురుకుప్పం, మే 19 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కిట్టును రూ.1410 వ్యయంతో ఇవ్వనుంది. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించగా, 2019లో వైసీపీ వచ్చాక ఆపేశారు. తాజాగా మళ్లీ ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు లబ్ధి చేకూరుస్తారు. ఈ కిట్‌లో 11 రకాల సామగ్రి ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన తల్లులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో అందజేస్తారు. ఈ పథకం పునరుద్ధరించడంపై ఇది మంచి ప్రభుత్వం అంటూ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కిట్‌లో ఉండే వస్తువులివే..

బేబీ కిట్‌లో దోమల రక్షణ వల, బేబీ మాకింతోష్‌, బేబీ డ్రెస్‌, బేబీ టవల్స్‌, బేబీ నేపీ (ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగింది), బేబీ పౌడర్‌ 200 గ్రాములు (జాన్సన్‌), బేబీ షాంపు 100 మి.లీ(జాన్సన్‌), బేబీ ఆయిల్‌ 200 మి.లీ(జాన్సన్‌), బేబీ సోప్‌(జాన్సన్‌), బేబీ సోప్‌ బాక్స్‌, బేబీ రాటిల్‌ టాయ్‌ ఇందులో ఉంటాయి.

Updated Date - May 20 , 2025 | 01:57 AM