తప్పుడు సమాచారంతో ప్రయోజనం
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:44 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో తప్పుడు సమాచారంతో ప్రయోజనం పొందిన టీచర్లపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు కడప ఆర్జేడీ బృందం శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చింది.
టీచర్లపై వచ్చిన పిర్యాదులను పరిశీలించిన ఆర్జేడీ బృందం
చిత్తూరు సెంట్రల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో తప్పుడు సమాచారంతో ప్రయోజనం పొందిన టీచర్లపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు కడప ఆర్జేడీ బృందం శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చింది. సుమారు 135మంది టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎ్‌స)లో తప్పుడు సమాచారం నమోదు చేసి, బదిలీల్లో ప్రయోజనం పొందినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు వీటిపై బాధిత ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదులు సైతం వచ్చాయి. కడప ఆర్జేడీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ నేతృత్వంలో సూపరింటెండెంట్ బాబునాయక్ బృందం ఫిర్యాదులను పరిశీలించారు. జరిగిన పొరబాట్లకు సంబంధించి చేపట్టిన చర్యలపై ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నారు.
నేడు 545 ఎంటీఎస్ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్
మినిమం టైం స్కేల్ (ఎంటీఎ్‌స)కింద నియమించబడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 545 మంది టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియారిటీ జాబితా ఆధారంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.