క్రిస్ సిటీ పనుల్లో వేగం పెంచండి
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:32 AM
కోట, చిల్లకూరు మండల్లో జరుగుతున్న క్రిస్ సిటీ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్ అన్నారు.

ఇండస్ట్రియల్ ప్రధాన కార్యదర్శి యువరాజ్ సూచన
కోట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కోట, చిల్లకూరు మండల్లో జరుగుతున్న క్రిస్ సిటీ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్ అన్నారు. కోట మండలం కొత్తపట్నం, వావిళ్లదొరువు గ్రామాల్లో పరిశ్రమలకు కేటాయించిన భూములను శుక్రవారం జేసీ శుభంబన్సల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనతో కలిసి ఆయన పరిశీలించారు. ‘క్రిస్‌సిటీలో తాగునీటి పైపులైన్లు, విద్యుత్ అలంకరణ, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో మరికొన్ని పరిశ్రమలు కొత్తపట్నంకు రానున్నాయని.. వాటికి భూములు అవసరమైనప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతుల వద్ద భూములు తీసుకునేటప్పుడు గ్రామాల్లోని ఇళ్లను మినహాయించాలి’ అని యువరాజ్ సూచించారు. వావిళ్లదొరువులోని కృష్ణపట్నం లేదర్‌కాంప్లెక్స్ భూములనూ ఆయన పరిశీలించారు. ఎపీఐఐసీ జీఎం చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దారు జయజయరావు తదితరులు ఉన్నారు.