కాణిపాకంలో వైభవంగా విశేష ద్రవ్యాహుతి
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:14 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా వరసిద్ధుడి ఆలయంలో విశేష ద్రవ్యాహుతిని వేదపండితులు మంగళవారం వైభవంగా నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా వరసిద్ధుడి ఆలయంలో విశేష ద్రవ్యాహుతిని వేదపండితులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఏఈవో రవీంద్రబాబు తన సిబ్బందితో కలసి పూర్ణాహుతి పూజా ద్రవ్యాలను ఉదయం అలంకార మండపం ఉన్న కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను కొలువుదీర్చి విశేష సంధి, రెండవ కాలపూజ, స్ధండిలమండలేశ్వర పూజ, హోమం, వ్రత సమర్పణ, రెండవ పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి, దీపారాధన చేశారు. సాయంత్రం విశేషసంధి, మూడవకాలపూజ, స్ధండిలమండలేశ్వర పూజ, హోమం, వ్రత సమర్పణ, మహాపవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి, దీపారాధనను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.