Share News

జంట ఏనుగుల హల్‌చల్‌

ABN , Publish Date - May 06 , 2025 | 01:08 AM

రామకుప్పం మండలంలో ఆదివారం రాత్రి జంట ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. రామకుప్పం-89పెద్దూరు రహదారిపై విహరిస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశాయి. అనంతరం ననియాలతాండా గ్రామ సమీప పొలాలు, తోటల్లో స్వైరవిహారం చేశాయి.పశుగ్రాసం పంటను తిన్నంత తిని ధ్వంసం చేశాయి.

జంట ఏనుగుల హల్‌చల్‌
89పెద్దూరు రహదారిలో జంట ఏనుగులు

రామకుప్పం, మే 5 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలో ఆదివారం రాత్రి జంట ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. రామకుప్పం-89పెద్దూరు రహదారిపై విహరిస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశాయి. అనంతరం ననియాలతాండా గ్రామ సమీప పొలాలు, తోటల్లో స్వైరవిహారం చేశాయి.పశుగ్రాసం పంటను తిన్నంత తిని ధ్వంసం చేశాయి.అనంతరం మామిడితోటల్లో ప్రవేశించి పలు చెట్ల కొమ్మలను విరిచేశాయి.మామిడికాయలను నేలపాలు చేశాయి.ప్రస్తుతం జంట ఏనుగులను నారాయణపురం అడవిలోకి తరిమినట్టు ననియాల అటవీ విభాగాధికారి హరికుమార్‌ తెలిపారు. ఏనుగులు అడవికే పరిమితమయ్యేలా ట్రాకర్లు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులెవరూ రాత్రివేళ పొలాల వద్దకు వెళ్ళరాదని సూచించారు. అదేవిధంగా అటవీ ప్రాంత ప్రజలు చీకటి పడక ముందే ఇళ్లకు చేరుకోవాలన్నారు. ఏనుగులు పొలాల వైపు వచ్చిన విషయం తెలిసిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - May 06 , 2025 | 01:08 AM